డ్రోన్ల యాక్టివిటీని నిలిపివేసిన UAE
- January 23, 2022యూఏఈ: డ్రోన్లు, తేలికపాటి క్రీడా విమానాలతో సహా అన్ని ఫ్లయింగ్ కార్యకలాపాలను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MOI) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. పౌర విమానయాన జనరల్ అథారిటీతో సమన్వయంతో సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అనుమంతిచిన ప్రాంతాల్లో ఈ క్రీడల ప్రాక్టీస్ ను పరిమితం చేయకుండా దీన్ని దుర్వినియోగం చేయడం, నిషేధించబడిన ప్రాంతాల్లో డ్రోన్ లను ఎగురవేయడం వంటి వాటిని ఇటీవల గుర్తించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. అసురక్షిత పద్ధతుల నుండి సంరక్షించడానికి, ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి MOI, పౌర విమానయాన జనరల్ అథారిటీ కట్టుబడి ఉందన్నారు. అయితే, డ్రోన్లను ఉపయోగించి షూటింగ్ ఒప్పందాలు లేదా వాణిజ్య లేదా ప్రకటనల ప్రాజెక్ట్ ల కోసం అవసరమైన మినహాయింపులు, అనుమతులను తీసుకోవడానికి తప్పనిసరిగా సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించింది. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా కార్యకలాపాలను నిర్వహిస్తే, మార్గదర్శకాలను విస్మరిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని MOI స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు