కారు నుంచి అగ్నిజ్వాలలు స్తంభించిన ట్రాఫిక్
- March 28, 2016
ఒక కారు నుంచి అగ్ని జ్వాలలు వ్యాపించడంతో ట్రాఫిక్ స్తంభించింది. దక్షిణదిశగా ఉన్న జెబెల్ ఆలీ వైపు అల్ ఖిల్ రహదారిపై ఈ సంఘటన జరగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ఒక ప్రత్యక్షసాక్షి షుజా మహ్మద్ ఫక్రుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం , ఫైనాన్షియల్ కూడలి రహదారి నిష్క్రమణ సమీపంలో ఒక కారు అగ్నికి ఆహుతి కాబడటం తాను చూసినట్లు తెలిపాడు. "నేను అల్ ఖిల్ రోడ్ దుబాయ్ మాల్ చివరివైపునకు సమీపిస్తుండగా రహదారిపై అనేక కార్లు నిలిచిపోయినట్లు చూసినట్లు తెలిపాడు. అందరు పనికి ప్రయాణమయ్యె సమయంలో ఉదయం 8 గంటల వెళ ఒక కారులో నుంచి మంటలు రావడం చూసినట్లు తెలిపాడు. నేను నిప్పు ఒక నలుపు రంగు జి ఎం సి యుకోన్ ఎస్యూవీ చూసినపుడు నేను కారు ముందు ఇంజిన్ భాగంలో మంట రావడం కనిపించింది మరియు మరొక వాహనం నుంచి ఒక వ్యక్తి మండుతూ ఉన్నఅగ్నిజ్వాలలు ఆర్పే పరికరంతో ప్రయత్నిస్తున్నాడు. రహదారిపై పలు వాహనాలు ఆగిపోయి ఉన్నాయని ...ఆ సమయంలో అత్యవసర వాహనాలు అక్కడకు వచ్చినట్లు తాను చూడలేదని తెలిపాడు. ఈ సంఘటనతో అల్ ఖిల్ రోడ్డుపై సంభవించింది. రోజూ తిరిగే ప్రాంతంలో వాహనదారులు జాగ్రత్తతో ప్రయాణించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







