వారం పాటు మెగా సేల్ కార్నివాల్ : ఎయిర్ ఏషియా
- March 28, 2016
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా, ఎయిర్ ఏషియా ఎక్స్ వారం పాటు మెగా సేల్ కార్నివాల్ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. రేపటి నుంచి ఏప్రిల్ 3 వరకు అతి తక్కువ ధరలకే ప్రయాణికులకు విమానయాన సౌకర్యాన్ని కల్పిస్తోంది. డొమెస్టిక్ విమాన సర్వీసులకు రూ.1,099, అంతర్జాతీయ విమాన సర్వీసులను రూ.2,999 కనీస టికెట్ ధరను నిర్ణయించింది. ఈ మెగాసేల్లో టికెట్లు కొనుక్కున్న ప్రయాణికులు జూన్ 1 నుంచి నవంబర్ 24 లోపల ఎప్పుడైనా ప్రయాణించవచ్చు.ఈ సందర్భంగా ఎయిర్ఏషియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ తేహ్ మాట్లాడుతూ ఈ మెగా సేల్ ద్వారా 22 దేశాల్లోని 100 గమ్యస్థానాల్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చన్నారు.
జైపూర్, కొచ్చి, పుణె, వైజాగ్, గువాహటి, బెంగళూరు, న్యూదిల్లీ ఒక సారి వెళ్లడానికి రూ.1,099 టికెట్ ధరగా నిర్ణయించారు. కొచ్చి నుంచి బెంగళూరుకి రూ.2,999, బాలి రూ.6,299, సింగపూర్ రూ.5,899, మకావు రూ.9,299, ఫుకెట్ రూ.7,799, పెర్త్ రూ.13,399గా నిర్ణయించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







