ఏపీ కరోనా అప్డేట్
- January 28, 2022
అమరావతి: ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు కరోనా మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 12వేల 561 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 12 మంది కోవిడ్ తో చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 8వేల 742 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక లక్ష 13వేల 300 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 40వేల 635 మందికి కరోనా పరీక్షలు చేశారు. తాజాగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో అత్యధికంగా 1,710 కరోనా కేసులు వెలుగుచూశాయి. గుంటూరు జిల్లాలో 1,625.. కడప జిల్లాలో 1,215.. విశాఖ జిల్లాలో 1,211.. తూర్పుగోదావరి జిల్లాలో 1,067 కరోనా కేసులు బయటపడ్డాయి.
గడిచిన 24 గంటల్లో విశాఖపట్నంలో ముగ్గురు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో ప్రాణాలు వదిలారు. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,591కి పెరిగింది. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,48,608కి చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 21,20,717గా ఉంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,23,65,775 కరోనా టెస్టులు చేశారు.
కాగా నిన్న 13వేల 474 కరోనా కేసులు, 9 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. నిన్నటి పోలిస్తే ఇవాళ కొత్త కేసుల సంఖ్య తగ్గినా.. మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







