ప్రమోషనల్ స్కామ్: రెసిడెంట్స్‌కి DEWA హెచ్చరిక

- January 28, 2022 , by Maagulf
ప్రమోషనల్ స్కామ్: రెసిడెంట్స్‌కి DEWA హెచ్చరిక

దుబాయ్: దుబాయ్ యుటిలిటీ ప్రొవైడర్, డెవా పేరుతో వచ్చే అనుమానాస్పద లింకుల్ని క్లిక్ చేయడం లేదా అటాచ్‌మెంట్లను తెరవడం చేయరాదని హెచ్చరించింది. ఇలాంటి మోసపూరిత చర్యల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని డెవా కోరింది. 30వ వార్షికోత్సవం సందర్భంగా డెవా నుంచి బహుమతులు ఇవ్వనున్నారంటూ వాట్సాప్ ద్వారా మెసేజీలు వెళుతున్నాయి. అలా పంపబడిన లింకుని క్లిక్ చేస్తే, డెవా పేరుతో ఓ వెబ్‌సైట్ కనిపిస్తోంది. దుబాయ్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ - డెవా 30వ వార్షికోత్సవ సంబరాలంటూ అందులో పేర్కొంటున్నారు. అక్కడ కొన్ని పశ్నల్ని వుంచుతున్నారు. 8,000 దిర్హాముల విలువైన ఉచిత బహుమతి పొందవచ్చునని పేర్కొంటున్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిందిగా కూడా మెసేజీలను పంపుతున్నారు. ఇలాంటి వైరల్ మెసేజీలతో వినియోగదారులు నష్టపోయే ప్రమాదముందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా దుబాయ్ పోలీసులు, అందర్నీ అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఈ తరహా నేరాలకు పాల్పడే సైబర్ క్రిమినల్స్‌కి చట్ట ప్రకారం కఠిన శిక్ష విధిస్తారు. ఐదేళ్ళ వరకు జైలు శిక్ష, 2 మిలియన్ దిర్హాముల జరీమానా దోషులకు తప్పదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com