తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 28, 2022
హైదరాబాద్: తెలంగాణలో కోవిడ్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. పండుగ ముగిసిన వెంటనే కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 3,877 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనాకేసుల సంఖ్య 7,54,976 కాగా, మరణాల సంఖ్య 4,083గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 7,10,479 ఉండగా, తాజాగా 2,981 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 94.11 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 40,414 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
ఇక, ఇవాళ మొత్తం 1,01,812 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,18,77830 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, ఇవాళ కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1189 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో మేడ్చెల్ జిల్లాలో 348 మంది, రంగారెడ్డి జిల్లాలో 241 మంది, హన్మకొండ జిల్లాలో 140, ఖమ్మం జిల్లాలో 112, నిజామాబాద్ జిల్లాలో 107 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇక, మిగిలిన జిల్లాల్లో 100 లోపే కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!
- జెడ్డాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ప్రిన్స్ మజీద్ రోడ్డు విస్తరణ..!!
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి







