కువైట్ ఎయిర్ పోర్ట్.. 5 నెలల్లో 2.5 మిలియన్ల మంది ట్రావెల్

- January 29, 2022 , by Maagulf
కువైట్ ఎయిర్ పోర్ట్.. 5 నెలల్లో 2.5 మిలియన్ల మంది ట్రావెల్

కువైట్: ప్రవేశ పరిమితులను ఎత్తివేసినప్పటి నుండి మొదటి 5 నెలల్లో 2.5 మిలియన్లకు పైగా సిటిజన్స్, రెసిడెంట్స్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ద్వారా ప్రయాణించారు. కువైట్ గత సంవత్సరం ఆగస్టు 1వ తేదీన రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిని దేశంలోకి వచ్చేందుకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు మొదటి తేదీ నుండి డిసెంబర్ 2021 చివరి వరకు ఉన్న కాలంలో, 1.377 మిలియన్ల మంది సిటిజన్స్, రెసిడెంట్స్ ఎయిర్ పోర్ట్ ద్వారా పోగా.. అదే సమయంలో 1.18 మిలియన్ల మంది ప్రయాణికులు వచ్చారు. ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసినప్పటి నుండి గత డిసెంబర్ చివరి వరకు 22,500 కంటే ఎక్కువ విమానాలు వచ్చిపోయాయి. ఇందులో  11,228 విమానాలు కువైట్‌కు రాగా.. 11,276 విమానాలు దేశం నుండి బయలుదేరాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com