సౌదీలో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు

- January 29, 2022 , by Maagulf
సౌదీలో క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు

సౌదీ: కోవిడ్-19 క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన పౌరులు రెండేళ్ల వరకు జైలుశిక్ష, SR200,000 ($53,330) జరిమానా విధించబడుతుందని  సౌదీ అరేబియా ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘించిన ప్రవాసులను దేశం నుండి బహిష్కరిస్తామని, వారిని తిరిగి రాకుండా శాశ్వతంగా నిషేధిస్తామని హెచ్చరించింది.  ప్రస్తుతం సౌదీలో దాదాపు 10 మిలియన్ల మంది విదేశీయులు పనిచేస్తున్నారని అంచనా. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుందని సౌదీ అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com