యెమెన్‌లో భారతీయ ఫాదర్‌ను చంపిన ఐసిస్ ఉగ్రవాదులు

- March 28, 2016 , by Maagulf
యెమెన్‌లో భారతీయ ఫాదర్‌ను చంపిన ఐసిస్ ఉగ్రవాదులు

యెమెన్‌లో మూడు వారాల క్రితం కిడ్నాప్ చేసిన భారత్‌లోని బెంగళూరుకు చెందిన క్యాథలిక్ ఫాదర్ టామ్ ఉజున్నలీల్ (56)ను ఐసిస్ టైస్టులు శుక్రవారం 'గుడ్ ఫ్రైడే' రోజున శిలువేసి చంపేశారు. ఈ విషయాన్ని వియన్నా ఆర్చిబిషప్ క్రిస్టఫ్ క్యథెడ్రల్ శ్యాన్‌బార్న్ ధ్రువీకరించారు. అయితే ఆయన ఈ విషయాన్ని ఎలా ధ్రువీకరించుకున్నారన్న విషయాన్ని వెల్లడించలేదు.మార్చి 4వ తేదీన ఏడెన్‌లో మదర్ థెరిస్సా క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వృద్ధుల ఆశ్రమంలోకి సాయుధులైన నలుగురు ఐసిస్ టెర్రరిస్టులు జొరబడి ఫాదర్ టామ్ (థామస్)ను కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన నలుగురు నన్స్, ఇద్దరు యెమెన్ స్టాఫ్, ఎనిమిది మంది వృద్ధులు, ఓ గార్డు మరణించారు.
కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లిన భారతీయ ఫాదర్ టామ్‌ను గుడ్‌ఫ్రై రోజున శిలువేసి చంపేస్తామని కూడా టెర్రరిస్టులు ముందుగానే హెచ్చరించారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com