యెమెన్‌లో భారతీయ ఫాదర్‌ను చంపిన ఐసిస్ ఉగ్రవాదులు
- March 28, 2016
యెమెన్‌లో మూడు వారాల క్రితం కిడ్నాప్ చేసిన భారత్‌లోని బెంగళూరుకు చెందిన క్యాథలిక్ ఫాదర్ టామ్ ఉజున్నలీల్ (56)ను ఐసిస్ టైస్టులు శుక్రవారం 'గుడ్ ఫ్రైడే' రోజున శిలువేసి చంపేశారు. ఈ విషయాన్ని వియన్నా ఆర్చిబిషప్ క్రిస్టఫ్ క్యథెడ్రల్ శ్యాన్‌బార్న్ ధ్రువీకరించారు. అయితే ఆయన ఈ విషయాన్ని ఎలా ధ్రువీకరించుకున్నారన్న విషయాన్ని వెల్లడించలేదు.మార్చి 4వ తేదీన ఏడెన్‌లో మదర్ థెరిస్సా క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వృద్ధుల ఆశ్రమంలోకి సాయుధులైన నలుగురు ఐసిస్ టెర్రరిస్టులు జొరబడి ఫాదర్ టామ్ (థామస్)ను కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన నలుగురు నన్స్, ఇద్దరు యెమెన్ స్టాఫ్, ఎనిమిది మంది వృద్ధులు, ఓ గార్డు మరణించారు.
కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లిన భారతీయ ఫాదర్ టామ్‌ను గుడ్‌ఫ్రై రోజున శిలువేసి చంపేస్తామని కూడా టెర్రరిస్టులు ముందుగానే హెచ్చరించారట.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







