భారత వాయు సేన సాహసయాత్ర

- March 28, 2016 , by Maagulf
భారత వాయు సేన సాహసయాత్ర

భారత వాయుసేనకు చెందిన పైలట్లు ఓపెన్‌ కాక్‌పిట్‌లో 10 వేల కిలో మీటర్లు ప్రయాణించి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. 14 మందితో కూడిన పైలట్ల బృందం పారామోటర్‌తో ఈ సాహసయాత్ర చేపట్టింది. ఫిబ్రవరి 1న పశ్చిమ్‌బంగలోని కలైకుందా ఎయిర్‌బేస్‌ నుంచి వీరి ప్రయాణం ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టి.. మొత్తం పది వేల కిలోమీటర్లు ప్రయాణించి గత శనివారం వారు తిరిగి ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఎంపీఎస్‌ సోలంకీ నేతృత్వంలోని ఈ బృందం.
గతంలో ఉన్న 9,132 కి.మీల రికార్డును అధిగమించింది. ఈ బృందం కన్యాకుమారి, గుజరాత్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హిమాలయపర్వతాలు, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ల మీదుగా ప్రయాణించి కలైకుందా చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com