దాల్చినచెక్కలో దాగి ఉన్నాఔషద గుణాలు..
- March 28, 2016
మనం ఇంటిలో వాడుకు వంటింటి వస్తువుల్లో చాలా వరకు అద్భుతమైన ఔషదాలు దాగి ఉన్నాయి. పసుపు, అల్లం,వెల్లుల్లి,లవంగాలు,దాల్చిన్ చెక్క లాంటి చాలావాటిలో ఔషదాలు దాగి ఉన్నాయి. దాల్చిన చెక్క అనగానే మషాలా వెంటనే జ్ఞాపకమొస్తుంది. బిరియాని తయారీలోనూ, మషాలా కూరలు తయారీలలో వినియోగిస్తారు. దాల్చినచెక్క వల్ల ఎన్ని ఉపయోగాలో .దాల్చిన చెక్క ఫైతోలు చేదుగా సువాసనగా తీక్షణమైనదిగా ఉంటుంది.ఇది పొట్టలోని క్రిములను నాశనం చేస్తుంది.అంగబలహీనతకు పురుషుల యవ్వన శక్తిని ఎల్లపుడు కాపాడగల అనేక మూలికలలో దాల్చినచెక్క అతి ముఖ్యమైంది. ఇది శరీరంలోనికి వెళ్ళిన వెంటనే చిన్న చిన్న పరమాణువులగా మారిపోయి రక్తంలో కలిసిపోయి శరీరమంతా వ్యాపించి అవయవాల క్రియలను క్రమబద్దం చేస్తూ ఉంటుంది. కామశక్తి పెరగడానికి, కామేంద్రీయానికి, ఉత్తేజం పొందడానికి కూడా ఇది దివ్య ఔషధమే. కొంచెము దాల్చిన చెక్క ముక్కను నోటిలో వేసుకుని చప్పరించి ఆ రసాన్ని మర్మాంగంపై లేపనం చేసుకుని అది ఆరిపోయిన తరువాత రతిలోలో పాల్గొంటూ ఉంటే మర్మాంగం మద్యలో పడిపోకుండా ఉండి ఇద్దరికీ సంతృప్తి కలిగిస్తుంది.ముఖం నునుపుగా ఉండాలంటే దాల్చిన చెక్కను మంచినీటితో అరగదీసి ఆ గంధాన్ని మొటిమలు, మచ్చలు, గుంటలు వీటిపైన లేపనం చేసి ఆరిపోయిన తరువాత చల్లని నీటితో కడుగుతూ ఉంటే చర్మం నునుపుగా తయారవుతుంది.తలనొప్పికి దాల్చిన మూలికల తైలం మార్కెట్లలో దొరుకుతుంది.దాన్ని తలనొప్పి వచ్చినప్పుడు ఒకటి రెండు చుక్కల తైలాన్ని నుదిటిపైన లేపనం చేసుకుంటూ ఉంటే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది.జలుబు సమస్యకు దాల్చిన చెక్కపొడి ఒక గ్రాము, లవంగంపొడి అర గ్రాము, శొంఠిపొడి ఒక గ్రాము ఈ మూడింటిని ఒక లీటర మంచి నీటిలో వేసి పావులీటరు మిగిలే వరకు మరిగించి వడపోసి దాన్ని మూడు బాగాలు చేసి ప్రతిరోజూ మూడుపుటలా సేవిస్తూ ఉంటే తీవ్రమయిన జలుబు తగ్గిపోతుంది.కడుపు ఉబ్బరము (గ్యాస్) దాల్చిన చెక్కపొడి ఒక గ్రాము, ఏలకుల పొడి ఒక గ్రాము, శొంఠిపొడి ఒక గ్రాము కలిపి భోజనానికి ముందు సేవిస్తూ ఉంటే కడుపు ఉబ్బరం తగ్గిపోయి మందాగ్ని హరించి బాగా ఆకలి పుడుతుంది.పిప్పిపళ్ళ భాధకు దూదిపైన ఒక చుక్క దాల్చిన తైలం వేసి ఆ దూదిని గుండ్రంగా చుట్టి నొప్పి ఉన్న పంటి దగ్గర నొక్కిపెట్టి ఉంచితే వెంటనే లోపల ఉన్న పురుగు చనిపోయి బాధ తగ్గిపోతుంది.చెవిలో నొప్పికి దాల్చిన తైలం రెండు చుక్కల మోతాదులో రెండు పుటల చెవులలో వేస్తూ ఉంటె చెవి బాధ వెంటనే తగ్గిపోతుంది.వాత రోగాలలో, పిత్తరోగములలో ఇది బాగా సహాయపడుతుంది. కంఠములో తడి అరిపోవటం, వాతనాడులలో మంటలు పుట్టడం అతిసారము, వంటి దురద, గుదద్వారము వద్ద కలిగే సమస్యలు, మొలలు, హృదయ వికారములు మొదలైన సమస్యలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







