సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
- February 01, 2022
సింగపూర్ తెలుగు సమాజం అనాదిగా నిర్వహించే సంక్రాంతి సందడి ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పరిరక్షించడమే ధ్యేయంగా పనిచేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం, ఈ కార్యక్రమాన్ని అంతర్జాలంలో ఎంతో సాంప్రదాయబద్ధంగా మనఊరి పండుగ వాతావరణం ప్రతిబింబించేలా నిర్వహించారు.
సింగపూర్ లో నివసిస్తున్న బాలబాలికలు, యువతీ యువకులచే వైవిధ్యభరితమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిచడమే కాకుండా, మహిళలచే రంగవల్లులు, చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించి, కార్యక్రమ వీక్షకుల అభిప్రాయసేకరణతో విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సంబరాలలో సింగపూర్ కాలమానం లో గుణించిన సింగపూర్ తెలుగు 2022 క్యాలెండెర్ ను ఆవిష్కరించారు.ఆంగ్లం ఉపయోగించకుండా తెలుగులో మాత్రమే మాట్లాడే కార్యక్రమం తెలుగు పలుకులు ప్రత్యేక ఆకర్షణగా అన్ని వయస్సుల వారిని ఆసాంతం ఆకట్టుకున్నాయి. మనకు తెలియకుండా మనం భాషను ఏవిధంగా కోల్పోతున్నామో వీక్షకులను ఆలోచించేట్లు చేసింది. తెలుగు సంస్కృతికి పట్టుగొమ్మలు,అచ్చతెలుగు సంక్రాంతికి ఆలవాలమైన తెలుగు రాష్ట్రాల పల్లెల్లో పండుగను వీడియో ద్వారా చూపించి అందరి మన్ననలను పొందారు.ఆటపాటల విజేతలకు తెలుగు సమాజం తరుపున బహుమతులు అందజేశారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి, తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు స్వాగత వచనాలు పలికారు. ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నిర్వహించిన పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన లక్ష్మీ నారాయణ , అనిత రెడ్డి, మైత్రి, సౌందర్య మరియు రాఘవ కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన స్వాతి కి కృతజ్ఞతలు తెలియజేసారు
సింగపూర్ తెలుగు సమాజం కమిటీ సభ్యులు మరియు కార్యక్రమ నిర్వహకులు స్వాతి కురిచేటి కోవిద్ నిబంధనల కారణంగా భోగి పండుగకు రేగుపండ్ల ప్యాకెట్స్ ని ఉచితంగా పంపిణీ చేయలేకపోయామని అలానే ప్రతి సంవత్సర మాదిరిగా అందరిని ప్రత్యక్షంగా కలవలేకపోయామని, అయినా కూడా అంతర్జాలంలో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు 5000 మంది వరకు వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించారని, కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలియచేశారు.
పోటీల్లో గెలుపొందిన వారి వివరాలను తెలియజేసారు.పోటీలు మరియు ప్రదర్శనలలో పాల్గొన్న వారందరికీ సర్టిఫికెట్లను పోస్ట్ ద్వారా పంపిస్తామని తెలియజేసారు.
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ విజేతలు: కృతిక (ప్రథమ బహుమతి) , డి.తస్విఖ (రెండవ బహుమతి) , సంహిత (తృతీయ బహుమతి) , గర్వ్ కుండ్లియా (కన్సొలేషన్ బహుమతి) మరియు వరాహగిరి వేదాంషి (కన్సొలేషన్ బహుమతి)
రంగోలి పోటీ విజేతలు: పావని చిలువేరు (ప్రథమ బహుమతి), నీలా దేవి (రెండవ బహుమతి) మరియు పోలినేని లీలా భార్గవి (తృతీయ బహుమతి)
తెలుగు పలుకులు పోటీ విజేతలు: కొమ్మిరెడ్డి నిషాంత్ రెడ్డి (ప్రథమ బహుమతి) , లక్ష్మి శ్రీనిజ చింతలపూడి (ద్వితీయ బహుమతి), రావూరి జ్ఞాన కౌశికి (తృతీయ బహుమతి) మరియు నామ సాయి ఈశ్వర (కన్సొలేషన్ బహుమతి)
ఆహ్లాదభరితంగా జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ, స్వచ్ఛంద సేవకులకు , కార్యవర్గానికి , కార్యక్రమానికి సహకరించిన స్పాన్సర్లకు సింగపూర్ తెలుగు సమాజం కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలను తెలియజేసారు.
_1643735343.jpg)



తాజా వార్తలు
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్‌లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు
- జెనీవా కార్యక్రమానికి ఖతార్ ప్రాతినిధ్యం..!!
- పవిత్ర కాబాకు కొత్త 'కిస్వా'తో అలంకరణ పూర్తి..!!
- ఫుజైరాలోని 'మ్యూజికల్ స్ట్రీట్'కు అరుదైన ఘనత..!!
- హోర్ముజ్‌లో సంబంధాలు, సముద్ర భద్రతకు కృషి..!!
- ఎనిమిది వేర్వేరు డ్రగ్ కేసుల్లో 14 మంది అరెస్టు..!!
- ఎన్నారైల కోసం ఇండియా కొత్త ఇన్వెస్ట్ మెంట్ రూల్స్..!!









