భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- February 04, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 1,49,394మందికి కరోనా సోకింది. నిన్నటితో పోలిస్తే 13% తక్కువ కేసులు నమోదయ్యాయి. ఇక గత 24 గంటల్లో 2,46,674 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీల సంఖ్య 4,00,17,088కి చేరుకుంది. అటు కరోనాతో మరో 1,072 మంది మరణించారు.కాగా ప్రస్తుతం దేశంలో 14,35,569 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివివిటీ రేటు 9.27%గా ఉంది. నమోదైన కొత్త కేసుల్లో అత్యధికంగా కేరళలో 42,677 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 16,436 కేసులు, మహారాష్ట్రలో 15,252 కేసులు, తమిళనాడులో 11,993 కేసులు, రాజస్థాన్‌లో 8,073 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాల నుండి 60 శాతానికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







