అబుధాబి బిగ్ టికెట్: భారతీయ మహిళకు జాక్‌పాట్..

- February 04, 2022 , by Maagulf
అబుధాబి బిగ్ టికెట్: భారతీయ మహిళకు జాక్‌పాట్..

అబుధాబి: అబుధాబిలో నివసిస్తున్న ప్రవాస భారతీయురాలు లీనా జలాల్ తాజాగా బిగ్ టికెట్ విజేతగా నిలిచింది.కేరళలోని త్రిచూర్‌కు చెందిన జలాల్ నిన్న అబుధాబిలో జరిగిన డ్రాలో 22 మిలియన్ దిర్హామ్‌లను గెలుచుకుంది.లీనా జలాల్ మరో 10 మంది స్నేహితులతో కలిసి ఇటీవల కొనుగోలు చేసిన టికెట్ నం.144387 వారికి ఇలా అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.లీనా గెలిచిన భారీ నగదును వీరందరూ సమానంగా పంచుకోనున్నారు. ఇక ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల లీనా ఆనందం వ్యక్తం చేసింది. "నోట మాట రావట్లేదు. నాకు ఏమి చెప్పాలో తెలియడం లేదు. చాలా సంతోషంగా ఉంది. బిగ్ టికెట్ నిర్వాహకులకు కృతజ్ఞతలు" అని లీనా చెప్పింది. లీనా మరియు ఆమె స్నేహితులు గెలుపొందిన మొత్తంతో ఏమి చేయాలో ఇంకా ప్లాన్ చేయలేదు, కానీ వారు దాంట్లో కొంత భాగాన్ని స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకుంటున్నామని చెప్పింది.కాగా, ఆమె ప్రస్తుతం అబుధాబిలో హ్యూమన్ రిసోర్సెస్ ప్రొఫెషనల్‌గా విధులు నిర్వహిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com