కాన్సర్ పేషెంట్స్ కి యోగా థెరపీ కార్యక్రమం

- February 04, 2022 , by Maagulf
కాన్సర్ పేషెంట్స్ కి యోగా థెరపీ కార్యక్రమం

హైదరాబాద్:క్యాన్సర్ పై పోరాటాన్ని వేగవంతం చేయడానికి మరియు అవగాహన పెంపొందించడానికి, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించడం కొరకు మెడికవర్ హాస్పిటల్స్ కాన్సర్ పేషెంట్స్ కి యోగా థెరపీ కార్యక్రమాన్ని నిర్వహించింది.

"Close the care gap" అనే సందేశంతో ఈ యోగా థెరపీని ప్రాంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా  పాల్గొన్నారు.ప్రతి కుటుంబంలో క్యాన్సర్ మహమ్మారితో ఒకరిని కోల్పోవడం బాధ కలుగుతుందని క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడంతో ప్రాణాలను దక్కించుకోవచ్చన్నారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ జూలూరి,సర్జికల్ ఆంకాలజిస్ట్  మెడికవర్  కాన్సర్ ఇన్స్టిట్యూట్  మాట్లాడుతూ క్యాన్సర్  వల్ల మన దేశంలో 8.5 లక్షల మంది చనిపోతున్నారు . ఈ పరిస్థితి తరచుగా అజ్ఞానం మరియు అపోహ ల నుండి బయటకు వచ్చే భయాన్ని సృష్టిస్తుంది.జీవనశైలిని సవరించడం లేదా కీలక ప్రమాద కారకాలను పరిహరించడం ద్వారా 30% క్యాన్సర్ కేసులను నిరోధించవచ్చు.ఈ యోగా థెరపీ ముఖ్య ఉద్దేశం చాలా మంది కాన్సర్ పేషెంట్స్ ఈ యోగా వల్ల జీవనశైలిలో మార్పు మరియు వాళ్ళా ఆరోగ్య పరంగా ఎంతో దోహద పడుతుంది .తర్వాత డాక్టర్ సాద్విక్ రఘురాం,మెడికల్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ మాట్లాడుతూ క్యాన్సర్ యొక్క ప్రమాదాలను ప్రజలు అర్థం చేసుకోవడానికి మరియు సకాలంలో స్క్రీనింగ్ ద్వారా సంక్లిష్టతలను పరిహరించడం కొరకు మరింత అవగాహన కల్పించాల్సి ఉంది.సకాలంలో స్క్రీనింగ్ చేయడం వల్ల క్యాన్సర్ ప్రారంభం కావడానికి ముందు కూడా నిరోధించవచ్చు అన్నారు .ఈ  సందర్భంగా డాక్టర్ వినోద్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ మాట్లాడుతూ ముఖ్యంగా యూత్ దూమపానం, మద్యాపానానికి దూరంగా ఉండాలని కోరారు. మంచి ఫుడ్ తీసుకుని క్యాన్సర్ ను తరిమేయాలని  పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఇతర వైద్య సిబ్బంది మరియు సెంటర్ హెడ్ స్వప్నిల్ రాయ్, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com