నాని తన స్టైల్లో రిలీజ్ డేట్ ను ప్రకటించేశాడు
- February 04, 2022
కోవిడ్ థర్డ్ వేవ్ ప్రభావం కాస్త తగ్గింది. థియేటర్స్ విషయంలో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని వార్తలు రావడంతో మన టాలీవుడ్, బాలీవుడ్ సహా అందరూ స్టార్స్, మేకర్స్ వారి సినిమా విడుదల తేదీలను తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మన టాలీవుడ్‌ను గమనిస్తే.. మన మేకర్స్ వారి సినిమాల విడుదల విషయంలో రెండు రిలీజ్ డేట్స్‌ను ప్రకటించడం గమనార్హం. అయితే అందరూ రెండు రిలీజ్ డేట్స్ ప్రకటించడమేంటి? అని నానికి అనిపించిందా? లేదా సరదాగా అనిపించిందో తెలియదు కానీ.. ఏకంగా తన 'అంటే సుందరానికీ' సినిమాకు ఏడు రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేశారు.
అంటే సుందరానికీ సినిమాకు సంబంధించి ఏడు రిలీజ్ డేట్స్ ఇవేనా? అని తెలియజేసేలా ఓ పోస్టర్‌ను నాని తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘మీరంత రెండు బ్లాక్ చేస్తే.. మేం ఏడు చేయకూడదా! ఫుల్ అవకాయ సీజన్ బ్లాక్డ్. మెల్లడా డిసైడ్ చేస్తాం’ అని ట్వీట్‌తో పాటు పోస్టర్ రిలీజ్ చేశారు. నాని తన స్టైల్లో చెప్పిన ఈ ట్వీట్ కి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతోన్న అంటే సుందరానికీ! సినిమా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తోంది. మలయాళ హీరోయిన్ నజ్రీయా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
మీరు అంతా రెండు రెండు Block చేస్తే మేము ఏడు చేయకూడదా 😉
— Nani (@NameisNani) February 3, 2022
Full ఆవకాయ season blocked.
Mellaga decide chestham 😎#AnteSundaraniki
#NazriyaFahadh #VivekAthreya @MythriOfficial @oddphysce @nikethbommi pic.twitter.com/31yC8ruXyZ
గత ఏడాది శ్యామ్ సింగరాయ్ చిత్రంతో హిట్ కొట్టిన నాని.. ఇప్పుడు దసరా అనే సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం నాని సరికొత్త గెటప్‌లో మేకోవర్ అవుతున్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సాగే చిత్రమిది. దీని కోసం నాని తెలంగాణ యాసపై మరింత ఫోకస్ పెట్టబోతున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







