యూఏఈ- కేరళ మంచి, చెడు సమయాల్లో కలిసి ఉన్నాయి: యూఏఈ మంత్రి

- February 05, 2022 , by Maagulf
యూఏఈ- కేరళ మంచి, చెడు సమయాల్లో కలిసి ఉన్నాయి: యూఏఈ మంత్రి

యూఏఈ: ఎక్స్ పో 2020 దుబాయ్‌లో కేరళ వీక్ ఇన్ ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్‌, యూఏఈ అంతర్జాతీయ సహకార మంత్రి రీమ్ అల్ హషిమీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, భారతీయ వ్యాపారవేత్త M.A. యూసుఫ్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహాయ మంత్రి రీమ్ అల్ హషిమీ మాట్లాడుతూ.. కేరళను ‘దక్షిణ భారతదేశంలో మెరిసే ఆభరణం’ అని కొనియాడారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను "మెంటర్ మరియు గైడ్" గా అభివర్ణించారు. భారతదేశం, కేరళతో యూఏఈకి బలమపై సంబంధాలు ఉన్నాయని, వాణిజ్యం- స్థిరమైన వ్యాపార వృద్ధిలో భాగస్వాములుగా కష్ట సమయాల్లో.. మంచి సమయాల్లో కలిసి ఉన్నాయన్నారు. ప్రేక్షకులను ఉద్దేశించి మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మాట్లాడుతూ.. ఎమిరాటీలు కేరళీయులను తమ హృదయాల్లో పెట్టుకుంటారని, ఇది సంతోషకరమైన అనుభూతిని కలిగిస్తోందని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com