యూఏఈ- కేరళ మంచి, చెడు సమయాల్లో కలిసి ఉన్నాయి: యూఏఈ మంత్రి
- February 05, 2022
యూఏఈ: ఎక్స్ పో 2020 దుబాయ్‌లో కేరళ వీక్ ఇన్ ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్, యూఏఈ అంతర్జాతీయ సహకార మంత్రి రీమ్ అల్ హషిమీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, భారతీయ వ్యాపారవేత్త M.A. యూసుఫ్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సహాయ మంత్రి రీమ్ అల్ హషిమీ మాట్లాడుతూ.. కేరళను ‘దక్షిణ భారతదేశంలో మెరిసే ఆభరణం’ అని కొనియాడారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను "మెంటర్ మరియు గైడ్" గా అభివర్ణించారు. భారతదేశం, కేరళతో యూఏఈకి బలమపై సంబంధాలు ఉన్నాయని, వాణిజ్యం- స్థిరమైన వ్యాపార వృద్ధిలో భాగస్వాములుగా కష్ట సమయాల్లో.. మంచి సమయాల్లో కలిసి ఉన్నాయన్నారు. ప్రేక్షకులను ఉద్దేశించి మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మాట్లాడుతూ.. ఎమిరాటీలు కేరళీయులను తమ హృదయాల్లో పెట్టుకుంటారని, ఇది సంతోషకరమైన అనుభూతిని కలిగిస్తోందని అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్‌లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్‌లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







