వెరైటీ మాస్క్ వచ్చేసిందోచ్..మాస్క్‌పెట్టుకొని తినొచ్చు… తాగొచ్చు…
- February 05, 2022
కరోనా నుంచి రక్షణ పొందాలంటే తప్పని సరిగా మాస్క్ ధరించాలి. ముక్కు, నోరూ మూసే విధంగా మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఎక్కువ భాగం కరోనా వైరస్ ముక్కుద్వారానే శ్వాసవ్యవస్థలోకి ప్రవేశిస్తుంది. దీంతో ముక్కు కవర్ అయ్యే విధంగా మాస్క్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాస్క్‌ను తీయకూడదు. అయితే, తినే సమయంలోనూ, తాగే సమయంలోనూ మాస్క్‌ను తీయాల్సిన అవసరం ఉంటుంది. హోటల్స్‌కు వెళ్లిన సమయంలో మాస్క్ తీసేయ్యడం వలన కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది.
దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ కొరియాకు చెందిన ఆత్మన్ అనే సంస్థ కేవలం ముక్కును మాత్రమే మూసి ఉంచేలా ఓ మాస్క్‌ను రూపొందించింది. ఈ మాస్క్‌కు కోస్క్ అనే పేరు పెట్టింది. కో అంటే కొరియా భాషలో ముక్కు అనే అర్ధం ఉంది. దీంతో ఈ నూతన మాస్క్‌కు కోస్క్ అనే పేరును పెట్టారు. ఇకపై తినే సమయంలోనూ, తాగే సమయంలోనూ మాస్క్ తీయాల్సిన అవసరం లేదని ఆత్మన్ సంస్థ పేర్కొన్నది. ప్రస్తుతం ఈ మాస్క్‌ను ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







