జ్వరం కారణంగా రాలేని కేసీఆర్..ప్రధానికి స్వాగతం పలికిన తలసాని
- February 05, 2022
హైదరాబాద్ : ముందుగా అనుకున్నట్టే జరిగింది. ప్రధాని మోదీకి జీఎంఆర్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగం పలికారు. తలసానితో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సైతం ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రధాని హైదరాబాద్ పర్యటన ఆద్యంతం.. వెంటే ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లలేకపోయారు. మోదీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా పఠాన్‌చేరులోని ఇక్రిశాట్‌కు హెలికాప్టర్‌లో చేరుకున్నారు. అక్కడ ఇక్రిశాట్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించనున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ ముచ్చింతాల్‌లో జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







