ఏంటా కుంటి సాకులు..కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
- February 05, 2022
హైదరాబాద్: రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ మోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. 80 వేల పుస్తకాలు చదివానన్న మీ జ్ఝానం ఏమైపోయింది, ఇదేనా మీ సంస్కారం అని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినా రాలేనంత బిజీ షెడ్యూల్ ఏముందన్నారు. మీరు కోరినప్పుడల్లా ప్రధాని అపాయిట్‌మెంట్ ఇచ్చిన విషయాన్ని మర్చిపోయారా అని ఆయన నిలదీశారు. రాష్ట్రానికి ప్రధాని వస్తే స్వాగతం పలకాలనే సోయి లేకుండా ఫాంహౌజ్‌కే పరిమితమవుతారా అని ఆయన మండిపడ్డారు. కుంటిసాకులు చెబుతూ తప్పించుకోవడానికి మీకు సిగ్గన్పించడం లేదా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకుండా దేశ ప్రధానిని అవమానించారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







