తెలంగాణ కరోనా అప్డేట్
- February 06, 2022
హైదరాబాద్:తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 48వేల 434 కరోనా పరీక్షలు నిర్వహించగా… 1,217 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 383 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 103, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 99 కేసులు గుర్తించారు.
అదే సమయంలో 3వేల 944 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒకరు కోవిడ్ తో మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,77,530 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,46,932 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26వేల 498 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,100కి పెరిగింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. శనివారంతో(2098) పోలిస్తే ఆదివారం కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గింది.
తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







