శివ కార్తికేయన్, అనుదీప్ సినిమా మొదలు Shiva Karthikeyan, Anudeep movie start
- February 10, 2022
చెన్నై: ప్రముఖ నటుడు శివ కార్తికేయన్ టాలీవుడ్ అరంగేట్రం కోసం ప్రతిభావంతులైన యువ దర్శకుడు అనుదీప్ కె.వి.తో కలిసి పని చేస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు, తమిళ్) షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తను దర్శకత్వం వహించిన ‘జాతి రత్నాలు’ బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించిన తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న దర్శకులలో ఒకడిగా మారిపోయాడు అనుదీప్. ‘వరుణ్ డాక్టర్’ చిత్ర విజయంతో తెలుగువారికీ మరింత చేరువయ్యాడు హీరో శివ కార్తికేయన్. ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ స్క్రిప్ట్ తయారు చేసినట్టు అనుదీప్ తెలిపాడు. శివకార్తికేయన్ కు ల్యాండ్‌మార్క్ గా వుండే ఈ 20వ చిత్రం గురువారం ప్రారంభం కావడంతో పాటు రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టేసింది. సింగిల్ షెడ్యూల్ గా ఈ సినిమా కరైకుడి, పాండిచ్చేరిలో చిత్రీకరించబోతున్నారు. ప్రస్తుతం శివ కార్తికేయన్, సత్యరాజ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ కథ యూకే లోని లండన్ నేపథ్యంలో జరుగుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ–ఫ్రాన్స్ సంబంధాల బలోపేతంపై షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!







