సానియా జంటకు చుక్కెదురైంది..
- March 29, 2016
వరుసగా రెండో టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంటకు చుక్కెదురైంది. మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ ఇండో-స్విస్ ద్వయం రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. భారత కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-హింగిస్ జంట 4-6, 2-6తో మార్గరీటా గస్‌పర్యాన్ (రష్యా)-మోనికా నికెలెస్కూ (రుమేనియా) జోడీ చేతిలో ఓడిపోయింది. 66 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట తమ సర్వీస్‌ను ఐదుసార్లు కోల్పోవడం గమనార్హం. గత నెల రోజుల్లో సానియా-హింగిస్ జంట వరుసగా మూడు టోర్నీల్లో (ఖతార్ ఓపెన్, ఇండియన్ వెల్స్, మయామి ఓపెన్) క్వార్టర్ ఫైనల్ దశను దాటలేకపోయింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







