'మేముసైతం' టెలివిజన్ షో
- March 29, 2016
'మంచి' చేయడానికి హీరోలు వెనకడుగేస్తున్నారు... మంచి కోసం మన హీరోయిన్లు అడిగిన వెంటనే ఓకే అని సిద్ధమవుతున్నారు. హీరోలు మాత్రం చుక్కలు చూపిస్తున్నారు.. లక్ష్మీప్రసన్న''మనవల్ల మరొకరి జీవితం నిలబ డుతుందనకున్నప్పుడు వీలైనంతగా సాయం చేయడం మనిషిగా మన విధి. అలాంటి కార్యక్రమమే మేము చేస్తున్న 'మేము సైతం'. ఈ కార్యక్రమంలో పాల్గొనమని మన తెలుగు హీరోహీరోయిన్లందరినీ అడిగాను. హీరోయిన్లు స్పందించినంతగా కూడా హీరోలు స్పందించడం లేదు. ఈ విషయంలో బాలీవుడ్ హీరోలు చాలా చాలా బెటర్...''అని అన్నారు నటి, నిర్మాత లక్ష్మీమంచు.ఆమె హోస్ట్‌గా రూపుదిద్దుకుంటున్న 'మేముసైతం' టెలివిజన్ షో గురించి తెలియజేయడానికి బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్లో ఓ సమావేశం ఏర్పాటుచేశారు. నటులు సుశాంత్, రకుల్ ప్రీత్‌సింగ్‌తో పాటుగా నిర్మాత జెమినీ కిరణ్, జెమినీటీవీ బిజినెస్ హెడ్ సుబ్రహ్మణ్యం, నార్త్ రీజియన్ హెడ్ కాశీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ ''మేము సైతం కాన్సెప్ట్ రెండేళ్ల క్రితం నా మదిలో వచ్చిన ఆలోచన. అయితే దానిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలియలేదు. సరిగ్గా ఆరు నెలల క్రితం కేంద్ర మాజీ మంత్రి సుశీల్‌కుమార్ షిండే తనయురాలు శ్రుతి షిండే ఈ కాన్సెప్ట్ గురించి నా దగ్గర డిస్కస్ చేయడంతో దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాను. హిందీలో 'మిషన్ సప్నే' పేరిట ఈ కార్యక్రమం ఆమె రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి ప్రతి శనివారం ప్రసారమయ్యే ఈ షో చూసిన తరువాత అయినా హీరోలు స్పందిస్తారని ఆశిస్తున్నాను .మొత్తం 26 భాగాలుగా ఈ షో చేయనున్నాం. నీడీ పీపుల్ కోసం స్టార్స్ రియల్‌గా కష్టపడటమే ఈ షో'' అని అన్నారు.రకుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడుతూ '' క్యాన్సర్ బాధిత చిన్నారి కోసం కూరగాయలు అమ్మాను'' అని అన్నారు. -
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







