భారత్ కరోనా అప్డేట్
- February 12, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్నిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,407 కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,25,86,544కి చేరింది. అయితే కరోనా మరణాలు మాత్రం నిలకడగా నమోదవుతున్నాయి. కొత్తగా 804 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,07,981కి పెరిగింది.
అటు దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 6,10,443గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,36,962 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా రికవరీల సంఖ్య 4,14,68,120కి చేరింది. గడిచిన 24 గంటల్లో 46,82,662 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,72,29,47,688 డోసుల కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కాగా డైలీ కరోనా పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







