‘హిజాబ్’పై మాట్లాడుతున్న దేశాలకు భారత్ హెచ్చరిక
- February 12, 2022
న్యూఢిల్లీ: భారత అంతర్గత అంశాల్లో బయటి దేశాల ప్రేరేపిత వ్యాఖ్యలు ఆమోదనీయం కాదంటూ ‘హిజాబ్’పై మాట్లాడుతున్న దేశాలకు భారత్ గట్టి హెచ్చరిక పంపింది. విదేశాల్లో మత స్వేచ్ఛను పర్యవేక్షిస్తూ, దానిపై రిపోర్ట్ చేసే అమెరికా ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్ఎఫ్ అంబాసిడర్, రషీద్ హుస్సేన్ హిజాబ్ వివాదంపై మాట్లాడడం గమనార్హం. కర్ణాటక ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. స్కూళ్లలో హిజాబ్ ను నిషేధించడం మత స్వేచ్ఛను కాలరాయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
దీంతో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి స్పందించారు. ట్విట్టర్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో వస్త్రధారణ పట్ల కొన్ని దేశాల స్పందనపై.. మీడియా కోరుతున్న విచారణలకు మా స్పందన ఇదే’’ అని పేర్కొన్నారు.
‘‘కర్ణాటకలోని కొన్ని విద్యా సంస్థల్లో వస్త్రధారణ అంశం కర్ణాటక హైకోర్టు న్యాయ సమీక్షలో ఉంది. మా రాజ్యాంగ నిర్మాణం, యంత్రాంగాలు, మా ప్రజాస్వామ్య విలువలు, రాజకీయం పరిధిలో అంశాలను చర్చించి, పరిష్కరించుకుంటాం. భారత్ గురించి సరైన అవగాహన ఉన్నవారు వాస్తవ అంశాలను సరిగ్గా అర్థం చేసుకోగలరు. మా అంతర్గత అంశాలపై ప్రేరేపించే వ్యాఖ్యలను ఆమోదించం’’ అంటూ బాగ్చి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







