ఘంటసాల పేరు మీద జిల్లా ని ఏర్పాటు చేయాలి
- February 12, 2022
పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం సాయంత్రం 'ఘంటావధాని'గా బిరుదు పొందిన విశాఖ వాస్తవ్యులు,డా.సయ్యద్ రహమతుల్లా గానావధానం కార్యక్రమం అంతర్జాల వేదికపై 14 దేశాల ప్రతినిధుల సమక్షంలో ఘనంగా నిర్వహించబడింది.
ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్, మరియు శుభోదయం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ఘంటసాల శతజయంతి సంవత్సరంగా 366 రోజులపాటు నిర్వహింపబడుతున్న నిర్వహింపబడుతున్న "ఘంటసాల స్వర రాగ మహా యాగం" కార్యక్రమంలో భాగంగా 70వ రోజు విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు.
డా.వంశీ రామరాజు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు ఘంటసాల కి భారతరత్న పురస్కారంతో గౌరవించాలని,ఆంధ్ర రాష్ట్రంలో ఒక జిల్లాకు ఘంటసాల పేరు పెట్టాలని సూచించారు.వంశీ సంస్థ తరఫున ఘంటసాల చదువుకున్న విజయనగరం మహారాజా సంగీత కళాశాలలో ప్రతి సంవత్సరం, ఉత్తమ విద్యార్థికి స్కాలర్షిప్ అందించబోతున్నామని ప్రకటించారు.
14 దేశాల నుండి సుమారు 20 మంది పృచ్ఛకులు పాల్గొని ఘంటసాల మాస్టారి పాటలపై, వారి జీవిత విశేషాలపై వివిధ కోణాలనుండి ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగి సభను రక్తి కట్టించారు. సమయోచితంగా అడిగిన ప్రతి ప్రశ్నకు వెంటనే సంపూర్ణమైన వివరణతో అవధాని సమాధానాలను అందించి అందరిని అబ్బురపరిచారు.ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మండలి బుద్ధ ప్రసాద్, మాధవపెద్ది సురేష్,సాలూరి వాసూరావు, భువనచంద్ర విచ్చేసి ప్రసంగించారు.
నిర్వాహకులుగా అమెరికా నుండి డా.వంగూరి చిట్టెన్ రాజు సింగపూర్ నుండి కవుటూరు రత్న కుమార్ పాల్గొనగా, రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా సభానిర్వహణ గావించారు.
పృచ్ఛకులుగా గోవర్ధన్ మల్లెల,న్యూజిలాండ్‌త, తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి, రమకంచిభొట్ల, ఆస్ట్రేలియా, రాధిక నోరి, అమెరికా, లక్ష్మి రాయవరపు, కెనడా సత్య మల్లుల, మలేషియా, సింగపూర్ నుండి ఊలపల్లి భాస్కర్, గుంటూరు వెంకటేష్,సుబ్బు వి పాలకుర్తి, కాత్యాయని గణేశ్న, ఉసిరికల తాతాజీ, ఖతార్, డాక్టర్ బూరుగుపల్లి వ్యాసకృష్ణ,ఉగాండా, విక్రమ్ కుమార్ పెట్లూరు, దక్షిణాఫ్రికా, వెంకప్ప భాగవతుల, ఖతార్,రాణి మాధవ్, ఒమాన్, డాక్టర్ వెంకటపతి తరిగోపుల, నార్వే, పీసపాటి జయ, హాంకాంగ్,రాజేష్ తోలేటి, యూ.కె,ఆర్ ప్రసన్నలక్ష్మి, హైదరాబాద్ పాల్గొన్నారు.




తాజా వార్తలు
- కొత్త వాటర్‌ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









