శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- February 13, 2022
హైదరాబాద్: హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో 248.4 గ్రాముల బంగార పట్టుబడింది. పట్టుబడ్డ బంగారం విలువ రూ.12.74 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. జడ్డా నుంచి శంషాబాద్ కు వచ్చిన SV 754 విమానంలో ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
ఈ క్రమంలో ఓ ప్రయాణికుడి వద్ద 248.4 గ్రాముల విదేశీ బంగారం లభ్యమైంది.దీంతో అధికారులు అతని నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారులు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.ఈ నెల 8వ తేదీన శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది.
దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు 407 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ రూ.20.25 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. బంగారాన్ని నల్లటి కార్బన్ పేపర్ లో చుట్టి అక్రమంగా తరలిస్తున్నాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







