డయాబెటిస్ తగ్గించే ప‌చ్చి బ‌ఠానీ

- February 13, 2022 , by Maagulf
డయాబెటిస్ తగ్గించే ప‌చ్చి బ‌ఠానీ

మధుమేహంతో బాధపడేవాళ్లు దాదాపుగా ప్రతి ఇంటా ఒక్కరైనా ఉంటారు.రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించుకోడానికి పడరాని పాట్లు పడుతుంటారు. స్వీట్ల మీద మమకారం చంపుకోవాలి.. డెయిలీ వ్యాయామం చేయాలి. అయితే మంచి ఆహారంతో షుగర్ లెవల్స్ ను సులభంగా తగ్గించొచ్చు. అలాంటి ఆహార పదార్థాల్లో పచ్చి బఠానీలు ముందుంటాయి. 

టైప్ 1:డ‌యాబెటిస్ ఉన్న‌వారిలో క్లోమ గ్రంథి ప‌నిచేయ‌ని కార‌ణంగా ఇన్సులిన్ విడుద‌ల కాదు. దీంతో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి.                                                                                  టైప్ 2: డ‌యాబెటిస్‌లో క్లోమగ్రంథి విడుద‌ల చేసే ఇన్సులిన్‌ను శ‌రీరం స‌రిగ్గా ఉప‌యోగించుకోదు.అందువ‌ల్ల ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం వ్యాయామం చేయ‌డం, స‌రైన పోష‌కాల‌తో కూడిన ఆహారాన్ని తీసుకోవ‌డం, వేళ‌కు భోజనం చేయ‌డం, నిద్ర పోవ‌డం వంటి అల‌వాట్ల‌ను పాటిస్తే టైప్ 2 డ‌యాబెటిస్ త్వ‌ర‌గా అదుపులోకి వ‌స్తుంది. 

అయితే టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం తాము తీసుకునే ఆహారంలోనూ ఎంతో జాగ్ర‌త్త వ‌హించాలి.వారు తినే ఆహారాలు ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిల‌ను పెంచ‌నివి అయి ఉండాలి. అప్పుడే షుగ‌ర్ అదుపులో ఉంటుంది. ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిల‌ను పెంచ‌ని ఆహారాల విష‌యానికి వ‌స్తే.. వాటిలో ప‌చ్చి బ‌ఠానీలు ముందు వ‌రుస‌లో ఉంటాయ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇవి నిజంగా టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వ‌ల్ల షుగ‌ర్ అదుపులో ఉంటుంది. 

అంతేకాదు, వీటిలో ఉండే ఫైబ‌ర్ అంత త్వ‌ర‌గా ఆక‌లి కానీయ‌దు. దీని వ‌ల్ల తిండి మీద కోరిక త‌గ్గి ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. దీంతో బ‌రువు త‌గ్గుతారు. హైబీపీ రాకుండా చూస్తుంది. ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉన్నందున శ‌రీరానికి పోష‌ణ అందుతుంది. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం పచ్చి బ‌ఠానీల‌ను త‌మ ఆహారంలో భాగం చేసుకుంటే సుల‌భంగా డ‌యాబెటిస్‌ తగ్గించుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com