3 ఎంవోయూలను కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
- February 15, 2022
దుబాయ్: తాజ్ బిజినెస్ బే హోటల్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో "దుబాయ్ ఇన్వెస్ట్ మెంట్ రోడ్ షో" విజయవంతంగా సాగుతోంది.పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా పరిశ్రమల మంత్రి మేకపాటి నేతృత్వంలోని అధికారుల బృందం దుబాయ్ లో పర్యటిస్తోంది. దుబాయ్ పర్యటనలో భాగంగా సోమవారం 3 MoUలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్నది. ఇందులో రెండు జీ2బీ, ఒక బీ2బీ అవగాహన ఒప్పందాలు ఉన్నాయి. లండన్ కు చెందిన కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో రూ.3వేల కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, కాజస్ కంపెనీ ఎండీ రవికుమార్ పంగా ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. రీటైల్ వ్యాపారంలో గ్రాంట్ హైపర్ మార్కెట్ బ్రాండ్ నేమ్ తో 25 సంవత్సరాలుగా సత్తా చాటుతున్న రీజెన్సీ గ్రూప్ తో జీ2బీ(గవర్నమెంట్ టు బిజినెస్) ఒప్పందం కుదిరింది. రూ.150 కోట్ల విలువైన 25 రీటైల్ ఔట్ లెట్ల ఏర్పాటుకు ముందుకొచ్చి రీజెన్సీ గ్రూప్ ఎంవోయూ కుదుర్చుకున్నది. అనంతపురం, కడప, కర్నూలు, మదనపల్లి,చిత్తూరు, నెల్లూరు, హిందూపురం ప్రాంతాలలో పంపిణీ కేంద్రాలు, స్పైసెస్ అండ్ పల్సెస్ ప్యాకేజీ యూనిట్లను ఏర్పాటు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. యూఏఈ రీటైల్ సంస్థల ఒప్పందంతో ఆంధ్రప్రదేశ్ రీటైల్ వాణిజ్యం మరింత బలోపేతం అవ్వనుంది. విశాఖలోని "ఫ్లూయెంట్ గ్రిడ్" అనే ఎస్సార్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ లో భాగమైన ట్రోయో జనరల్ ట్రేడింగ్ సంస్థతో బీ2బీ ఏపీ అవగాహన ఒప్పందం కుదిరింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఏఐ అండ్ ఎంఎల్ టెక్నాలజీస్ పేరుతో విశాఖలో కొత్తగా 300 హైఎండ్ ఐ.టీ ఉద్యోగాలిచ్చే కంపెనీతో మరో ఒప్పందాన్ని ఏపీ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఎస్సార్ గురేర్ ఇన్వెస్ట్ మెంట్ గ్రూప్ బోర్డు సభ్యులు మాజీదల్ గురేర్ , ఫ్లూయెంట్ గ్రిడ్ సంస్థకు చెందిన సమయ్ మంగళగిరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ప్రజా రవాణాకు సంబంధించిన డీజిల్ వాహనాలను తీర్చిదిద్దే పరిశ్రమను వైఎస్ ఆర్ కడప జిల్లా జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఏర్పాటు చేయనున్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్ బాబు, జాయింట్ డైరెక్టర్ వీఆర్ వీఆర్ నాయక్, ఈడీబీ, ఏపీఐఐసీ,యూఏఈ ఇండియన్ కాన్సుల్ జనరల్ అమన్ పూరి అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







