భారత్‌లో కరోనా కేసుల వివరాలు
- February 15, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 12,29,536 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 27,409 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,26,92,943కి చేరింది. నిన్న347 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,09,358కి చేరింది.
ఒక్క రోజులో 82,817 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,17,60,458కి చేరింది. ప్రస్తుతం దేశంలో 5,09,358 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 97.82 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు కూడా 2.23 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. నిన్న 44,68,365 మందికి టీకా వేశారు. మొత్తంగా ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 173.42 కోట్ల డోసులను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







