నితిన్ పుట్టినరోజు సందర్భంగా 'అ ఆ' ఫస్ట్ లుక్ రిలీజ్
- March 30, 2016
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' రూపొందిస్తున్న చిత్రం 'అ ఆ'.ఈ చిత్రం తొలి ప్రచార చిత్రాలను కధానాయకుడు నితిన్ పుట్టినరోజు (30-3-16) సందర్భంగావిడుదలచేశారు.ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ ..'మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ చిత్రాన్నిప్రేక్షకులు మే లో చూడబోతున్నారు అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సందర్భం గా తెలిపారు.మిక్కీజె. మేయర్ సంగీతం సంగీత ప్రియులను అలరిస్తుం దని అన్నారు. ఏప్రిల్ మొదటివారంలో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మే 6 న చిత్రాన్ని విడుదల చేయనున్నామని నిర్మాత తెలిపారు.త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.ఏప్రిల్ మొదటివారంలో చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. మరోవైపు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.మే6న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో నితిన్ పుట్టినరోజుతో ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.ఈ చిత్రానికి సంగీతం- మిక్కిజె. మేయర్,, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్- ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి.ప్రసాద్ సమర్పణ శ్రీమతి మమత నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







