జల సంరక్షణకు సరికొత్త ఆలోచన
- March 30, 2016
నేటి రోజుల్లో నీటిని తీసుకురావడమే కాదు.. నీటి వృథాను అరికట్టడం కూడా భగీరథ ప్రయత్నమే. ఇటువంటి ప్రయత్నమే ఓ పాఠశాల అద్భుతంగా చేస్తోంది. ఓ కొత్త ఆలోచన.. ఓ చిరు ప్రయత్నం.. చక్కటి క్రమ శిక్షణ.. వెరశి నిత్యం వేలాది లీటర్ల నీటిని ఆదా చేస్తున్నాయి. ఇది చదివిన ఎవరైనా అరే మనం ఇలా ఎందుకు ఆలోచించలేకపోయాం అనుకోవాల్సిందే.. ఒక్క పాఠశాలలోనే ఇంత జరుగుతుంటే.. దీనిని అన్ని పాఠశాలల్లో ఆచరిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉండదూ?పుణెలోని పింప్రీ ప్రాంతంలో సిటీ ప్రైడ్ పాఠశాల యాజమాన్యం జల సంరక్షణకు సరికొత్త ఆలోచన చేసింది.పిల్లలు పాఠశాల ముగిసి ఇంటికి వెళ్లగానే వారి వాటర్ బాటిళ్లలో నీటిని వృథాగా పారబోయటాన్ని పాఠశాల యాజమాన్యం గమనించింది. దీంతో నిత్యం పాఠశాల ముగిసి ఇంటికి వెళ్లబోయేముందు విద్యార్థుల వద్ద ఉన్న బాటిళ్లలో మిగిలిన నీటిని అక్కడే ఖాళీగా ఉన్న డ్రమ్ముల్లో పోసి వెళ్లాల్సిందిగా సూచించారు. దీనిని విద్యార్థులు చక్కగా అర్థం చేసుకొన్నారు. దీంతో నిత్యం అక్కడ ఏర్పాటు చేసిన డ్రమ్ములు నిండి వేలాది లీటర్ల నీరు లభిస్తోంది. ఈ నీటితో పాఠశాల ఆవరణలో మొక్కలను పెంచుతున్నారు. ఇంకా మిగిలిన నీటిని కారిడార్.. పాఠశాల ఆవరణను శుభ్రం చేయడం వంటి అవసరాలకు వినియోగిస్తున్నారు. నీటి వృథా గణనీయంగా తగ్గింది.. మరో పక్క మోటార్ వేయాల్సిన అవసరం రాకపోవడంతో కరెంటు కూడా ఆదా అవుతోంది. అన్నిటికీ మించి జల సంరక్షణలో విద్యార్థులు కూడా భాగస్వాములవుతున్నారు. చిన్న వయసులోనే నీటి విలువ వారికి తెలుస్తోంది.తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలు సిటీప్రైడ్ పాఠశాల ప్రయత్నాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందించారు. ఈ పాఠశాలలో విద్యార్థులు నీటి వృథాని అరికట్టాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తున్నారన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







