నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు
- February 15, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లో నకిలీ సర్టిఫికెట్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు అయ్యింది. మలక్‌పేట్-ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అంతర్ రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్స్ తయారీ ముఠాను నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10మంది అంతర్ రాష్ట్ర నిర్వాహకుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు తెలిపారు.
”నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశాము. రెండు ముఠాలను అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నాం. పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని వారికి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు అమ్ముతున్నారు. ప్రతి డిగ్రీకి ఒక రేటు ఫిక్స్ చేశారు. కావాల్సిన డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ప్రధాన నిందితుడు శ్రీకాంత్ రెడ్డి.. శ్రీసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కన్సల్టెన్సీ పెట్టాడు. టెలీకాలర్లు.. ఫెయిల్ అయిన విద్యార్థులకు కాల్ చేసి వారిని రప్పిస్తున్నారు.
బీటెక్ సర్టిఫికెట్ కు రూ.3 లక్షలు, బీఎస్సీ సర్టిఫికెట్ కు 1.7 లక్షలు, బీకాం సరిఫ్టికెట్ కు రూ.1.50 లక్షలు వసూలు చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కేతన్ సింగ్ సాయంతోనే ఈ దందా నడుస్తోంది. SRK యూనివర్సిటీ చైర్మన్ కు కూడా సంబంధాలు ఉన్నట్లు తేలింది. దీనిపై విచారణ చేస్తున్నాం. ఇక ప్రైడ్ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో కూడా మరో ముఠా ఇలాగే దందా చేస్తున్నారు.
పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను టార్గెట్ చేసుకుని ఒక్కో సర్టిఫికెట్ ను లక్షల్లో అమ్ముతున్నారు. SRK యూనివర్సిటీకి చెందిన 8 ఫేక్ సర్టిఫికెట్లు, మధ్యప్రదేశ్ లోని స్వామి వివేకానంద యూనివర్సిటీకి చెందిన 24 సర్టిఫికెట్లు, ఉత్తరప్రదేశ్ కి చెందిన గ్లోకల్ యూనివర్సిటీకి చెందిన 4 సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నాం. నిందితుల నుండి రబ్బర్ స్టాంప్స్, వివిధ యూనివర్సిటీల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు సీజ్ చేశాము. ఏడుగురు విద్యార్థులను కూడా అరెస్ట్ చేశాం. ఇంకా హైదరాబాద్ లో మరో 5 నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాలు ఉన్నట్లు గుర్తించాము. త్వరలోనే అరెస్ట్ చేస్తాము.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







