భీమ్లా నాయక్ విడుదల తేదీ ఖరారు
- February 15, 2022
హైదరాబాద్: పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా `భీమ్లా నాయక్` ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు పెరిగిపోగా.. సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 25న సినిమాని విడుదల చేయబోతున్నట్లు నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ ధరలకు సంబంధించిన జీవోని సవరించాలని భావిస్తుండగా, రాత్రి కర్ఫ్యూలు కూడా ఎత్తేశారు. దీంతో ‘భీమ్లా నాయక్’ని ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ‘భీమ్లా నాయక్’కు సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ మాటలు రాశారు. థమన్ సంగీతం అందించారు.
నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్‌గా చేస్తుండగా సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరించాడు. మలయాళ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్‌గా సినిమా తెరెకెక్కింది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







