విశాఖలో జాబ్ మేళా...
- February 16, 2022
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఫిబ్రవరి 18న విశాఖపట్నంలో జాబ్ మేళా నిర్వహించనుంది. ఈ జాబ్ మేళా ద్వారా పాత్రా ఇండియా బీపీఓ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 200 ప్రాసెస్ ఎగ్జిక్యూటీవ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జాబ్ మేళాకు హాజరయ్యే నిరుద్యోగ అభ్యర్ధులు ఫిబ్రవరి 17లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి మూడేళ్ళ డిప్లొమా, డిగ్రీ, పీజీ విద్యార్హతను కలిగి ఉండాలి. ఐదేళ్ల లోపు సంబంధిత పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఏడాదికి వేతనంగా 1,45,500 చెల్లిస్తారు. ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే హెచ్ ఆర్ రౌండ్, టెక్నికల్ రౌండ్, సీనియర్ మేనేజర్ రౌండ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూలను విశాఖపట్నంలోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ వుమెన్ , కాన్వెంట్ జంక్షన్ , జ్ణానాపురం నందు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్ధులు తమ అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకుని డాక్యుమెంట్స్ తో ఫిబ్రవరి 18, 2022 ఉదయం 9గంటలకు పై చిరునామాకు హాజరుకావాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://apssdc.in/industryplacements
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష