పోర్టు సామర్థ్యం పెంపునకు రూ. 2200 కోట్లు ఖర్చు ..
- March 30, 2016
పోర్టు ఆధునీకరణ, సామర్థ్యం పెంపునకు రూ. 2200 కోట్లు ఖర్చు చేస్తామని పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. పోర్టు సామర్థ్యం 90 మిలియన్ టన్నుల నుంచి125 మిలియన్ టన్నులకు పెరుగుతుందన్నారు. ఆయిల్ బంకరింగ్పై 26శాతం నుంచి 0.5 శాతానికి పన్ను తగ్గిందని, చమురు వాణిజ్యం పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా పోర్టుకు రైలు, రోడ్డు మార్గాలు నిర్మించినున్నట్లు తెలిపారు. భీమిలి దగ్గర రూ. 300 కోట్లతో క్రూయిజ్ టెర్మినల్‌కు ప్రతిపాదనలు వచ్చాయని, పోర్టు ప్రాంతంలో రూ. 10 కోట్లతో తాత్కాలిక ఏసీ టెర్మినల్‌కు ప్రతిపాదనలు వచ్చినట్లు కృష్ణబాబు వెల్లడించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







