ఈ నెల 13న విడుదల కానున్న 'బాహుబలి' ఆడియో

- June 10, 2015 , by Maagulf
ఈ నెల 13న విడుదల కానున్న 'బాహుబలి' ఆడియో

 యస్‌.యస్‌.రాజమౌళి రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి`ది బిగినింగ్‌' ఆడియో ఆవిష్కరణోత్సవం ఈనెల 13న.. తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించబడనుంది. 'యువ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.' ఈ వేడుకను నిర్వహించే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకొంది. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ, నాజర్‌ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చారు. జులై 10న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఆర్కా మీడియా పతాకంపై కె.రాఘవేంద్రరావు సమర్పణలో యార్లగడ్డ శోభ,దేవినేని ప్రసాద్‌ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నినిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com