అల్ ఫుత్తైమ్ లో వందల కొద్దీ కొలువులు

- June 10, 2015 , by Maagulf
అల్ ఫుత్తైమ్ లో వందల కొద్దీ కొలువులు

అల్‌ ఫుత్తైమ్ గ్రూప్‌ తరఫున ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి బంపర్‌ ఛాన్స్‌ ప్రకటించబడింది.వందల కొద్దీ ఉద్యోగాలు తమ గ్రూప్‌ నుంచి ఉద్యోగార్ధుల కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడిరచింది అల్‌ ఫుత్తైమ్ గ్రూప్‌. ఫామ్కో, ఐకియా వంటి బ్రాండ్స్‌కి సంబంధించిన సంస్థలు, మేనేజ్‌మెంట్‌ బిజినెస్‌, వాచెస్‌ అండ్‌ జ్యుయెలరీ, మెకానికల్‌ ఎలక్ట్రికల్‌ మరియు ప్లంబింగ్‌ ప్రాజెక్ట్స్‌ లాంటి విభాగాల్లో ఉద్యోగాలకు ఆస్కారం ఉన్నట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు.వీటిల్లో చాలావరకూ యూఏఈలోపలే ఖాళీగా ఉన్నాయి. అలాగే ఒమాన్, ఖతార్‌, ఈజిప్ట్‌, సౌదీ ఆరేబియా, కెన్యా, బహ్రెయిన్‌, జోర్డాన్‌, కువైట్‌లలో కూడా వేకెన్సీస్‌ ఉన్నాయట. తమ కంపెనీ జాబ్‌ వర్క్‌, లైఫ్‌ బ్యాలెన్స్‌ విషయంలో 5 పాయింట్లకు గాను 3.5 స్టార్స్‌ రేటింగ్‌ ప్రస్తుత, మాజీ ఎంప్లాయీస్‌ రేటింగ్‌ ఇచ్చారనీ, మేనేజ్‌మెంట్‌ అండ్‌ సేలరీ బెనిఫిట్స్‌ విషయంలో 3.25 పాయింట్లు, జాబ్‌ కల్చర్‌, జాబ్‌ సెక్యూరిటీ / అడ్వాన్స్‌మెంట్‌కి 3.75 పాయింట్లు వచ్చాయనీ ఇంత ప్రముఖమైన సంస్థలో ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకోవడం అద్భుత అవకాశమని సంస్థ ప్రతినిథులు వెల్లడిరచారు. వీటిల్లో కొన్ని ఉద్యోగాలకు సెప్టెంబర్‌ వరకు ఓపెనింగ్స్‌ ఉంటాయి. ఎలాంటి పొరపాట్లూ జరగకుండా ఫేస్‌ టు ఫేస్‌ లేదా ఫోన్‌లైన్‌ ఇంటర్వ్యూస్‌ జరుగుతాయని అల్‌ ఫత్తైమ్‌ గ్రూప్‌ ప్రతినిథులు వివరించారు. వివరాలకు www.afuturewithus.com వెబ్‌సైట్‌లో సంప్రదించగలరు.
 

 

--శాలెం బాబు,అడ్వకేట్(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com