ఐఐటీ హైదరాబాద్‌తో చేతులు కలిపిన బసవ తారకం ఆస్పత్రి
- February 19, 2022హైదరాబాద్: హీరో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఆస్పత్రి ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు బాసటగా నిలుస్తోంది. వేల సంఖ్యలో క్యాన్సర్ బాధితులకు విశిష్ట సేవలు అందిస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తాజాగా ఐఐటీ హైదరాబాద్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి కొత్తగా రేడియేషన్ ఫిజిక్స్ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందించనున్నాయి. ఈ మేరకు ఎంవోయూపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందం గురించి బసవతారకం ఆసుపత్రి మేనేజింగ్ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. బసవతారకం ఆసుపత్రి, ఐఐటీ హైదరాబాద్ చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని పేర్కొన్నారు. ఉమ్మడి కార్యాచరణ కోసం రెండు సంస్థలు ఓ అవగాహనకు వచ్చాయని తెలిపారు. కొత్త కోర్సు ప్రవేశపెట్టేందుకు జరిగిన ఒప్పందంపై ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ మూర్తి, బసవతారకం ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.సుబ్రమణేశ్వర్ సంతకాలు చేశారని బాలకృష్ణ వివరించారు. కాగా ఇటీవల బసవ తారకం ఆస్పత్రిలో చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ను బాలకృష్ణ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతంపై చర్చలు.. ముంబైలో జైశంకర్‌తో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ భేటీ
- టైగర్ ప్రాఫ్ ను చంపేందుకు రూ.35వేల సుపారీ!
- ప్రపంచ చరిత్రలోనే తొలిసారి ఉక్రెయిన్ అద్భుత రెస్క్యూ ఆపరేషన్
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ..!!
- జెడ్డాకు విమాన సర్వీసులు తగ్గించిన ఖతార్ ఎయిర్వేస్..!!
- విదేశాల్లో వివాహం..ఒమన్ పౌరులకు ప్రీ-మ్యారిటల్ వైద్య పరీక్షలు తప్పనిసరా?
- యూఏఈలో ఆన్లైన్లో అవమానిస్తే జైలుశిక్ష.. Dh500,000 వరకు జరిమానా..!
- మిస్ కేరళ 2026.. కువైట్‌కు చెందిన భారతీయ యువతికి రన్నరప్ టైటిల్..!!
- కువైట్‌లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త డి.వి. మల్హోత్రా కన్నుమూత..!!
- బహ్రెయిన్‌లో ఘనంగా ‘శారదోత్సవ్ 2026’ ప్రారంభం..!!







