భీమ్లా నాయక్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మంత్రి కేటీఆర్
- February 19, 2022
హైదరాబాద్: జనసేనాని పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. హిందీలో సైతం ఈ చిత్రం విడుదల కాబోతోంది మరోవైపు ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ సోమవారం జరగనుంది.హైదరాబాదులోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరగబోతోంది.ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా తెలంగాణ మంత్రి కేటీఆర్ వస్తున్నారు.
ఈ వార్తతో ఇటు పవన్ అభిమానులు, అటు టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఈ చిత్రంలో రానా మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. హీరోయిన్లుగా నిత్యామీనన్, సంయుక్తా మీనన్ లు నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు. తమన్ సంగీతాన్ని అందించగా సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!







