ట్రూజెట్ కడపకు సర్వీసులను ప్రారంభించింది..
- March 30, 2016
ప్రాంతీయ విమాన సేవలను అందించే ట్రూజెట్ కడపకు సర్వీసులను ప్రారంభించింది. ఏప్రిల్8న హైదరాబాద్- కడప, తిరుపతి-కడపలకు సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో వ్యాపారపరంగా చాలా ముఖ్యపట్టణమైన కడపకు ట్రూజెట్ ఒక్కటే సర్వీసులను అందిస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. ఇంత వరకు విమాన సర్వీసులు లేని నాగపూర్, ఔరంగాబాద్ తర్వాత ఇప్పుడు మూడో పట్టణం కడపకు సేవలను విస్తరిస్తున్నట్లు ట్రూజెట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. దీనివల్ల ఇప్పుడు కడప నుంచి నాగపూర్, గోవా, రాజమండ్రి పట్టణాలకు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.మూడో విమానం ఏటీఆర్-72 అందుబాటులోకి రావడంతో కొత్త సర్వీసులను ప్రారంభించినట్లు ట్రూజెట్ ఆ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







