రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ప్రధాని మోడీ భేటీ
- March 01, 2022
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు.యుక్రెయిన్– రష్యా యుద్ధంపై ఇండియా అనుసరిస్తోన్న వైఖరితో పాటు పలు అంశాలపై రాష్ట్రపతికి ..మోడీ వివరించినట్టు సమాచారం.యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను.. ముఖ్యంగా విద్యార్థులను తరలించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా గురించి రాష్ట్రపతికి మోడీ వివరించనున్నారు.
యుక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మోడీ కోవింద్‌కు వివరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.యుక్రెయిన్ గగనతలం మూసివేసినందున అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తొలుత సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి చేరుకునేలా సూచనలు చేస్తున్నారు.అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నారు.అలాగే పోలాండ్, స్లోవేకియాలకు చేరుకున్న భారతీయులను తరలింపును ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ







