బ్యాంక్‌ని మోసం చేసిన కేసులో వ్యక్తికి జైలు
- March 31, 2016
ఓ బ్యాంక్‌ని మోసం చేసిన కేసులో వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్షను విధించారు. 700,000 దిర్హామ్‌లు ఈ కేసులో సదరు వ్యక్తి బ్యాంకుకు బురిడీ కొట్టించాడు. పాకిస్తాన్‌కి చెందిన వ్యక్తిగా అతన్ని గుర్తించారు. కన్‌స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి బ్యాంక్‌ని మోసం చేశాడు. రెసిడెన్స్ వీసా మరియు ఎమిరేట్స్ ఐడీని కూడా ఫోర్జరీ చేసి బ్యాంకుని మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ వ్యక్తి గతంలోనూ ఇలాంటి అనేక నేరాలకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ విచారణలో వెల్లడయ్యింది. గతంలో బ్యాంకుని బురిడీ కొట్టించి, 408,000 దిర్హామ్‌లు నొక్కేసినట్లు విచారణాధికారులు వెల్లడించారు. క్రెడిట్ కార్డుల్ని కూడా ఫ్రాడ్ చర్యలకు వినియోగించాడు ఆ వ్యక్తి. తనకు పడ్డ శిక్షపై 15 రోజుల్లోగా ఆ వ్యక్తి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







