దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్
- March 31, 2016
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంక్వైరీ మరియు ఇన్వెస్టిగేషన్స్ ముగ్గురు ఒమనీ పౌరుల్ని అరెస్ట్ చేసింది. విలాయత్ సువైక్‌లో ఈ ముగ్గురూ దొంగతనానికి పాల్పడినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఉన్నతాధికారి వెల్లడించారు. అమాయకుల్ని, తమతోపాటు వాహనంలో ఎక్కించుకుని, వారిని గమ్యస్థానాలకు చేర్చుతామని చెప్పి, దారి తప్పించి వారిని దోచుకోవడం ఈ దొంగలకు వెన్నతో పెట్టిన విద్య అని పోలీసులు చెప్పారు. బాధితుల నుంచి డబ్బు, నగలు, సెల్‌ఫోన్లు, ఇతర ఖరీదైన వస్తువల్ని దోచుకుని, అక్కడి నుంచి ఆ దొంగలు పరారైపోతుండేవారు. నిందితుల్లో ఒకరు టైర్ షాప్ నుంచి 8 కార్ టైర్లను దొంగిలించాడు. ఆ టైర్లను తమ దొంగతనాలకు వినియోగిస్తున్న కారుకే వాడినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







