శ్రీశైలంలో అంబరాన్నంటిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

- March 01, 2022 , by Maagulf
శ్రీశైలంలో అంబరాన్నంటిన మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంభరాన్నంటాయి. శ్రీభ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి పుష్పపల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్‌ దీపకాంతుల నడుమ శ్రీశైల పురవీధులలో స్వామిఅమ్మవార్లను గ్రామోత్సవానికి తరలుతుండగా... ఉత్సవం ముందు కోలాటాలు, డమరుక నాదాలు అలరించాయి. పలు రకాల పుష్పాలతో దేదీప్యమానంగా, సర్వాంగ సుందరంగా తయారుచేసిన పుష్ప పల్లికీలో స్వామి అమ్మవార్లు గ్రామోత్సవంలో భక్తులకు కనువిందు చేశారు. గంగాధర మండపం నుండి అంకాలమ్మ గుడి, నండిమండపం వీదుగా వీరభద్రస్వామి ఆలయం వరకు పుష్పపల్లకి కన్నులపండువగా సాగింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com