తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 01, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19వేల 527 కరోనా టెస్టులు నిర్వహించగా, 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 64 కొత్త కేసులు వెలుగు చూశాయి. మంచిర్యాల జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో కొత్త కేసులు లేవు. మరికొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ కేసులే వచ్చాయి.
అదే సమయంలో మరో 401 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,083 మంది కరోనా బారినపడగా వారిలో 7,82,253 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 2వేల 719 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 4వేల 111 మంది కోవిడ్ తో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు 156 కరోనా కేసులు వచ్చాయి.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు