ఆఫీసుల్లో రమదాన్ నెలలో పనివేళలు ప్రకటన

- March 04, 2022 , by Maagulf
ఆఫీసుల్లో రమదాన్ నెలలో పనివేళలు ప్రకటన

యూఏఈ: పవిత్రమైన రమదాన్ నెలలో ఫెడరల్ ప్రభుత్వ కార్యాలయాల పని వేళలను యూఏఈ అధికారులు గురువారం ప్రకటించారు. రంజాన్ సందర్భంగా అన్ని ఫెడరల్ ప్రభుత్వ ఏజెన్సీల అధికారిక పని గంటలు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు ఉండనున్నాయి. శుక్రవారాల్లో పని వేళలు ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 వరకు మాత్రమే ఉంటాయి. జనవరి 2022 నుండి UAE తన అధికారిక పని వారాన్ని నాలుగున్నర రోజులకు తగ్గించి.. వీకెండ్ ని శని, ఆదివారాలకు మార్చిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com